telugu navyamedia
తెలంగాణ వార్తలు

మీరు కెమెరా ముందుకొస్తే టాలీవుడ్‌ లాగేసుకుంటుంది ..

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​కు మహీంద్రా గ్రూప్​ సంస్థల చైర్మన్​ ఆనంద్​ మహీంద్రా సరదా ట్వీట్​ చేశారు. మీరు కెమెరా ముందుకొస్తే టాలీవుడ్‌ లాగేసుకుంటుంద’ని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సరదాగా ట్వీట్‌ చేశారు.

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా పాపులర్ యాక్టింగ్‌వ్‌గా ఉన్నంటార‌న్న విష‌యం తెలిసిందే. అనేక విషయాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. సరదా విషయాలతో పాటు ఆసక్తికర విషయాలను సైతం ఆయన పోస్టు చేస్తూ ఉంటారు.తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Image

 జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్‌ను కేటీఆర్‌ బుధవారం సందర్శించి.. ట్రాక్టర్‌ నడిపారు. అక్క‌డ మహీంద్రా సంస్థ ఉత్పత్తి చేసిన నా 300001 ట్రాక్టర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ” హే మహీంద్రా జీ, మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్‌ చేసేందుకు నేను రెడీ. అందుకోసం మీ ట్రాక్టర్ల ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిస్తా’ అని ట్వీట్‌ చేశారు.

Image

కేటీఆర్ ట్వీట్ కు ఆనంద్ మహీంద్ర కూడా వెంటనే స్పందిస్తూ “కేటీఆర్ మీరు ఒక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్… అందులో సందేహం లేదు. ఆకాశాన్నంటుతున్న టాలీవుడ్ సామ్రాజ్యం మిమ్మల్ని దొంగిలిస్తుందేమో అనేది మాత్రమే నా ఆందోళన!” అంటూ చమత్కరించారు.

ఆయన ట్వీట్ పై స్పందించిన కేటీఆర్ “సార్ ఆడుకోవడానికి మీకు నేనే దొరికానా ?” అంటూ హిందీలో లో స్మైలీ ఏమోజీతో పోస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Related posts