తెలంగాణలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం వరద ముంపుకు గురైంది. ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. ముంపు బాధితులను సంజయ్ పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వరంగల్‌లో ఈ పరిస్థితులకు కారణం ఎవరని ప్రశ్నించారు. పలు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పత్తా లేకుండా పారిపోయారని అన్నారు. గరంలో కబ్జాల గురించి మాట్లాడితే స్థానిక ప్రజాప్రతినిధులకు కోపం వస్తుందని ఆరోపించారు.
వాళ్లకు సన్మానం చేయండి..