*డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు..
*రెడ్లు లేకపోతే నేను గెలవలేను..
*వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోతున్నారు..
*దళితులను రెడ్లు విభజిస్తున్నారు..
*వర్గపోరుకు రెడ్లు స్వస్తి చెప్పాలి..
వైసీపీలో రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితలుపై పడుతున్నారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… రెడ్లు సామాజికవర్గానికి చెందిన వారు రెండు గ్రూపులుగా అయ్యారంటే వారి ధ్యేయమంతా దళిత వాడలపైనే పడుతుందన్నారు.
రెడ్ల గ్రూపులతో దళితులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. రెడ్లు పంతానికి పోతే ఎంతైనా చేస్తారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు.
ఎస్సీగా రిజర్వేషన్ లేకపోతే తనకు సీటు వచ్చేది కాదన్నారు. రెడ్లు లేకపోతే తాను గెలవలేనని చెప్పారు.వర్గపోరుకు రెడ్లు స్వస్తి పలకాలని ఆయన కోరారు
అన్ని వర్గాల సహకారం లేకపోతే మెజార్టీ వచ్చేది కాదన్నారు. చిన్నచిన్న గొడవలతో వైసీపీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం బాధేస్తోందని అన్నారు. తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే పదవికి రాజీనామా చేస్తానని నారాయణస్వామి పేర్కొన్నారు.