telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వ్యవసాయానికే సగానికి పైగా బడ్జెట్ పెట్టిన ఘనత కేసీఆర్‌దే..

నల్గొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కేంద్ర సర్కార్ పై విరుచుకు పడ్డారు. కేసీఆర్ జేబులు నింపుతుంటే కేంద్రం చిల్లులు పెడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణా రైతులు ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తున్నారని… కేంద్రం తెచ్చిన చట్టాలతో వ్యవసాయం నాశనం అవుతుందని తెలిపారు. నూతన చట్టాలు ముమ్మాటికీ రైతుకు ద్రోహం చేసేవేనని… రైతుల పొట్టలు గొట్టి కార్పొరేట్ల కడుపులు నింపడమే మోడీ చట్టాల లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో మార్కెట్ కమిటీలు, వ్యవసాయ మార్కెట్ లు నామ మాత్రంగా మారిపోతాయని…. అంతిమంగా రైతులు అవస్థలు పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల బాధలను తీర్చి, వ్యవసాయాన్నీ లాభసాటిగా మార్చారని… వ్యవసాయానికి సగానికిపైగా బడ్జెట్ లో ఖర్చు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. నేడు తెలంగాణలో వలస పోయిన వారు సొంతూళ్లకు తిరిగివచ్చి వ్యవసాయాన్ని చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ మోదీ ప్రభుత్వం రైతుల జేబులకు చిల్లులు పెట్టి, కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఎవ్వరు ప్రశ్నించే అధికారం లేకుండా కొత్త వ్యవసాయ చట్టాల్లో మోడీ పొందిపర్చారని తెలిపారు.

Related posts