telugu navyamedia
తెలంగాణ వార్తలు

సమతామూర్తి విగ్రహావిష్కరణ : చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్న మోడీ..

హైద‌రాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. నుదుటిపై విష్ణునామాలు ధరించి సంప్రదాయ పట్టువస్త్రాల్లో మోదీ సమతా స్ఫూర్తి కేంద్రానికి విచ్చేశారు.

ఆశ్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి మోదీకి త్రిదండి చినజీయర్ స్వామి ఘనంగా స్వాగతం పలికారు. యాగశాలలోకి ప్రధాన మంత్రి మోదీని తీసుకెళ్లారు.

అక్కడ ఏర్పాటు చేసిన సమతా మూర్తి శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల పంచలోహ  భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు హైదరాబాద్ శివారులోని శ్రీ చిన్న జీయర్ ఆశ్రమంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం జరుగుతోంది.

శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల సువిశాల స్థలంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహావిష్కరణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం..

ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని సకల జనులకు అందించిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవద్రామానులు.. 11వ శతాబ్దానికి చెందిన కుల వివక్ష, పేద ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడిన అధ్యాత్మిక వైష్ణవయోగిశ్రీరామానుజాచార్యుల స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తైన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు.

Related posts