తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజులు సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటం, మరోపక్క పండుగకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యే వారికి బస్సుల కొరత ఉండటంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించి ఆ బస్సులను కూడా ప్రజా రవాణాకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి తోడు ప్రైవేట్ వాహనాలను కూడా వినియోగించనున్నట్లు తెలిసింది. రేపటి నుంచి తిరుగు ప్రయాణాలు మొదలుకానున్నాయి. మూడు రోజుల్లో కోటిన్నర మంది ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
రాజధానిపై స్పష్టత లేకుండా బొత్స మళ్లీ ఏదేదో మాట్లాడారు: టీడీపీ నేత సోమిరెడ్డి