* బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
*రమ్యశ్రీ కేసులో నిందితుడికి ఉరిశిక్ష
*రమ్యశ్రీ కుటుంబ సభ్యులు హర్షం..
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధించింది. ఇవాళ ఉదయం రమ్యశ్రీ హత్య కేసుకు నిందితుడు శశికృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
గుంటూరులోని గత ఏడాది ఆగస్టు 15న బీటెక్ విద్యార్థిని రమ్యను నిందితుడు శశికృష్ణ పట్టపగలు అందరూ చూస్తుండగానే . నడిరోడ్డుపై కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమ్యశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకు మండలం మట్లూరు గ్రామానికి చెందిన కుందాల శశికృష్ణను ఘటన 48 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.ఇన్‌స్టా గ్రామ్ లో రమ్యశ్రీ, శశికృష్ణకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత శశికృష్ణ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. కానీ శశికృష్ణను ఆమె దూరం పెట్టింది. తనను ప్రేమించకపోతే చంపేస్తానని కూడా హెచ్చరించాడు.
అయితే ఆగష్టు 15న రమ్యశ్రీని పిలిపించి హత్య చేశాడు. హత్యకు ముందు ఎనిమిది నిమిషాలు నిందితుడు మాట్లాడాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు. ఘటనా స్థలంలోనే శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల పాటు కేసు విచారణ సాగింది.
ఈ కేసులో 28 మంది సాక్షులను ధర్మాసనం విచారించింది. నిందితుడికి హైకోర్టులో అఫీల్ చేసుకోవడానికి న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. గుంటూరు 4వ ప్రత్యేక న్యాయమూర్తి రాంగోపాల్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. ఈ కేసుపై డిసెంబర్‌లో విచారణ ప్రారంభించింది కోర్టు. ఈనెల 26వ తేదీకి విచారణ పూర్తి అయింది.