telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేకు కరోనా పాజిటివ్

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె.. తన ట్విటర్ వేదికగా ప్రకటించారు. “నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలపాలని అనుకున్నాను. నియమ నిబంధనలను పాటిస్తూ స్వీయ నిర్భందంలోకి వెళ్ళాను. అలాగే ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ ఇంట్లోనే ఉండండి. కరోనా నుంచి కాపాడుకోండి ” అంటూ ఈ బుట్టబొమ్మ ట్వీట్ చేసింది. కాగా పూజా ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నారు.  

Related posts