telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సరిహద్దులో .. చొరబాటుదారుడు.. అదుపులోకి తీసుకున్న బి.ఎస్.ఎఫ్. ..!

pak will lose if war declared with india

ఇంకా భారత్-పాక్ సరిహద్దులలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. రోజు ఒక ఉగ్రవాదినైనా రక్షణ సిబ్బంది మట్టుపెడుతూనే ఉన్నారు. తాజాగా, సరిహద్దు సెక్యూరిటీ పోలీసులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఓ పాకిస్థాన్‌ జాతీయుడిని అరెస్టు చేశారు. గుజరాత్‌ రాష్ట్రం రణ్‌ ఆఫ్‌ కచ్‌ వద్ద ఓ 30 ఏళ్ల వ్యక్తి సరిహద్దు దాటుతుండగా గమనించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.

అర్ధరాత్రి 2.40 గంటల సమయంలో ఇతను భారత్‌ భూభాగంలోకి అడుగు పెడుతుండగా గస్తీ జవాన్లు పట్టుకున్నారు. భద్రతా దళాలు చుట్టుముట్టగానే అతను లొంగిపోయాడని తెలిపారు. విచారించగా అతను పాకిస్థాన్‌ జాతీయుడని తేలింది. సింధు ప్రావిన్స్‌ ఉమర్‌కోట్‌ జిల్లా వాసి అని, పేరు మనహార్‌ సోటా అని గుర్తించారు. అయితే అతని వద్ద ఎటువంటి మారణాయుధాలు లేవని, విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగిస్తామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు.

ఇక పుల్వామా ప్రతీకార చర్యగా చేసిన సర్జికల్ స్ట్రైక్ లో ఎందరు ఉగ్రమూక చనిపోయారనే దానిపై అనేక అనుమానాలు నెలకొనడంతో ఇప్పుడు ఇదొక రాజకీయ అంశంగా మారిపోయింది. బీజేపీ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కాబట్టి, దానిని రాజకీయంగా బాగానే ఉపయోగించుకుంటుంది; అదే తీరులో ప్రతిపక్షం కూడా రుజువులు రుజువులు చూపాలని కోరుతుండటం విశేషం. దీనిపై స్పందించిన రక్షణ శాఖ తాజాగా 12 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. దానిని అతి త్వరలో ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అందులో స్పష్టంగా కొన్ని ఫొటోలతో కూడిన రుజువులు రక్షణశాఖ సమర్పించినట్టు తెలుస్తుంది.

Related posts