తెలంగాణ రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీస్ అకాడమీ సంచాలకుడిగా వి.కె.సింగ్, అగ్నిమాపకశాఖ డీజీగా సంజయ్‌కుమార్ జైన్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా గోపికృష్ణను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కాగా సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.