మేషం : ఈ రోజు మేష రాశి వారికి వ్యాపారం, కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ తెలివితేటలు, అవగాహనతో చాలా క్లిష్టమైన విషయాలను పరిష్కరించుకుంటారు. ఎందుంకటే మీ అంచనాలకు అనుగుంగా ఉండరు. ఇల్లు, కార్యాలయంలో అన్ని సమస్యలను సహనంతో, సంయమనంతో విజయవంతంగా పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో ఈ రోజు మీరు కొంత బీజీగా ఉంటారు. వీలైనంత వరకు అనవసర విషయాల్లో తలదూర్చకండి.
వృషభం : వృషభ రాశి వారు పనిప్రదేశంలో మీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు అందుకుంటారు. మీరు వ్యాపారంలో భాగస్వామిగా ఉండటం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో కొంతమంది మీ వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటారు. వారు తమ భావాలను వ్యక్తపరచలేరు. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి.
మిథునం : మిథున రాశి వారు ఈ రోజు నిరాశ చెందాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా ఒప్పందానికి అంతరాయం కలగవచ్చు. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు ఉంటాయి. మీరు ఏదైనా డబ్బు గురించి స్నేహితుల నుంచి సహాయం తీసుకోవచ్చు. ఇది కొంతకాలం మీకు నిరాశకు గురిచేస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం : ఈ రోజు కర్కాటక రాశి ప్రజలు శక్తిమంతం అవుతారు. మీ సీనియర్ వ్యక్తుల సలహాలను పాటించడం ద్వారా ప్రయోజనం అందుకుంటారు. కార్యాలయంలో సహచరులు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. ఈ రోజు మీ పిల్లల కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. ఎందుకంటే ఈ రోజు మీ ఔదర్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీకు ఒత్తిడి నెలకొంటుంది.
సింహం : సింహ రాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సమయాన్ని కేటాయిస్తారు. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెడతారు. ఎందుకంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఆర్థింగా మీకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీరు నిజాయితీగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామి లేదా పిల్లల అభ్యర్థనను మీరు నెరవేర్చవచ్చు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు సోమరితనం మానుకోవాలి.
కన్య : కన్యా రాశి వారు పనిప్రదేశంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయోజనం పొదుతారు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీరు వ్యాపారంలో విజయం సాధించడానికి కృషి చేస్తారు. మీరు ఒకరి గురించి చెడుగా భావిస్తే దాన్ని గుర్తుంచుకోవద్దు. మీ అపార్థాలను తొలగించుకునే సమయం ఇది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మీ హృదయం మాట విని నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
తుల : ఈ రోజు మీరు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు ద్వారా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. తద్వారా మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. సృజనాత్మక పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. మీలో ప్రతిభను దాచడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి.
వృశ్చికం : వృశ్చిక రాశి వారు ఈ రోజు కార్యాలయంలో అధికారుల సహాయంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ పనితీరుతో సహచరులను ఆకట్టుకుంటారు. ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మీ మానసిక స్థితి బాగుంటుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. షాపింగ్ చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టండి. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.
ధనస్సు : ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామిత ఆనందపు క్షణాలు గడుపుతారు. పాత వివాదాలను మర్చిపోయి, మనస్సు నుంచి ప్రతికూల ఆలోచనలు తొలగించడానికి ప్రయత్నిస్తారు. మీరు దీన్ని చేయకపోతే మానసికంగా ఆందోళన చెందుతారు. నష్టాలను పూడ్చడానికి ఈ రోజు కష్టపడి పనిచేస్తారు. మిథున రాశి వ్యక్తి మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తారు. అనవసర వాగ్ధానాలు చేయడం మానుకోండి.
మకరం : ఈ రోజు మకర రాశి వారు చేయాలనుకున్న ఏ పనిలోనైనా గందరగోళం నెలకొంటుంది. ఏకాగ్రతతో ఏ పనిచేసినా అందులో విజయం సాధిస్తారు. మితిమీరిన భావోద్వేగాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు. వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. నూతన విషయాలపై శ్రద్ధ పెడతారు. ప్రేమ, వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
కుంభం : ఈ రోజు మీరు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి చింతించకుండా మీరు ప్రస్తుతం చేస్తున్న పనుల్లో దృష్టి పెట్టడం మంచిది. కార్యాలయంలో నూతన బాధ్యతలను పొందుతారు. మీరు దాని కోసం సిద్ధంగా ఉండాలి. మకర రాశి వారు పనిప్రదేశంలో లేదా కార్యాలయంలో మీకు సహాయం చేయవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమమాల్లో ఆసక్తి చూపుతారు.
మీనం : మీన రాశి వారు కార్యాలయంలో వాతావరణం కొంచెం తీవ్రంగా ఉంటుంది. మానసికంగా మిమ్మల్ని పరధ్యానంగా ఉంచుతుంది. వాతావరణాన్ని సజీవంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార పరంగా సంభాషించినట్లయితే వ్యాపారంలో లాభం ఉంటుంది. వృద్ధులకు ఈ సమయంలో మీ మద్దతు అవసరం. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు చర్చించడానికి సమయం ఉంటుంది.