telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో రాజకీయనాయకురాలి బయోపిక్ లో కంగనా…

జయలలిత ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. ఇంతటి గొప్ప నాయకురాలి కథను సినిమా చిత్రంచనున్నారు. అయితే కాంట్రవర్సీ క్వీన్ కంగనా ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ముంబై ప్రభుత్వాన్ని విశ్లేషిందని ముంబై పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఇటువంటివి మరెన్నో దాంతో వివాదాల రాణిగా కంగనా పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం కంగానా తమిళనాడుకు వరుసగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన జే జయలలిత జీవిత కథలో నటిస్తోంది. ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఎల్ అజయ్ దర్శకత్వంలో తెరకెక్కతోంది. ఇందులో ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామీ మరి కొందరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే తాజాగా భారత రాజకీయాలను శాసించి, తనదైన ముద్ర వేసుకున్న ఇందిరా గాంధీ కథను సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో కూడా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించబోతుంది. దీనిపై కంగనా స్పందిస్తూ.. ‘భారత రాజకీయ చరిత్రలో మనకు లభించిన అత్యంత దిగ్గజ నాయకురాలి పాత్రలో నటించాలని నేను ఎదురు చూస్తున్నా’ అంటూ కంగనా పేర్కొంది. ఇది ఇందిరాగాంధీ బయోపిక్‌ కాదని.. కేవలం పిరియాడిక్‌, పొలిటికల్‌ డ్రామాగా స్క్రిప్ట్ తయారవుతుందని తెలిపింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి నా ప్రశంసలు అంటూ తన ఫోటోలను పంచుకుంది. దర్శకుడు సాయి కబీర్ కథ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.

Related posts