telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి మెట్రో పేరు మార్పు..ఏపీ సర్కార్ ఉత్తర్వులు!

jagan

అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసమే పేరు మార్చినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.

విశాఖపట్టణంలో తలపెట్టిన మెట్రోకు కూడా అమరావతి పేరే ఉండడంతో ప్రాజెక్టు పేరును మార్చినట్టు వివరించింది. గతంలో నాగ్‌పూర్ మెట్రో ప్రాజెక్టు పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్‌గా మార్చినట్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాగే, లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చారని పేర్కొంది.

Related posts