telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆర్టికల్ 370 రద్దు ఇండియా అంతర్గత విషయం : పాక్ మంత్రి

india pakistan

జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం.  దీంతో జమ్మూ కాశ్మీర్ లో నిరసనలు వెల్లువెత్తాయి.  ఇక పాక్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.  జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని పునరుద్దరించే వరకు పోరాటం చేస్తామని, అప్పటి వరకు ఇండియాతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తి లేదని పాక్ స్పష్టం చేసింది. కాల్పుల ఉల్లంఘన, ఉగ్రవాదం నేపథ్యంలో పాక్ పై అంతర్జాతీయ సమాజం కఠినఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.  ఎఫ్ఏటిఎఫ్ పాక్ పై ఆంక్షలు విధించింది.  అటు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా పాక్ కు అప్పులు దొరకడం లేదు.  దీంతో ఆర్ధికంగా కుదేలైన పాక్, తన బుద్దిని క్రమంగా మార్చుకుంటున్నది.  ఆర్టికల్ 370 రద్దు అంశం ఇండియా అంతర్గత అంశమని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి పేర్కొన్నారు.  కాల్పుల విరమణ పునరుద్ధరణ తరువాత పాక్ కు కొంత ఆర్ధిక సహాయం అందింది.  దీంతో భారత్ తో మొండి వైఖరిని ప్రదర్శించకుండా ఉంటె తిరిగి ఆర్ధికంగా నిలదొక్కుకోవచ్చని పాక్ భావిస్తోంది.  

Related posts