telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సంబరంగా “షీరో అవార్డ్స్”

“షీరో మోడల్ ఓ మహాద్భుతం”
-మురళీమోహన్ – సుమన్ – ఆమని

కొన్ని సంస్థల లక్ష్యం వ్యాపారం – లాభాలు అయితే మరికొన్ని సంస్థల లక్ష్యం సేవతో కూడుకొన్న వ్యాపారం. ఈ రెండో కోవకు చెందినదే “షీరో హోమ్ ఫుడ్”. మూడు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారితో విలవిలలాడిన పేద మధ్యతరగతి వారికి ఓ స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 2౦౦౦ సంవత్సరంలో ఓ చిన్న గదిలో పురుడుపోసుకున్న “షీరో హోమ్ ఫుడ్” సంస్థ నేడు దక్షిణాది రాష్ట్రాలలో రెండు వేలకు పైబడి కుటుంబాలకు ఉపాధిని అందిస్తోంది. ఓ మహిళ తన ఇంటిలోని వంటగదినుండే వ్యాపారాన్ని ప్రారంభించి తాను చేసిన ఇంటి వంటలను ఆన్ లైన్ ద్వారా విక్రయించుటయే ఈ బిజినెస్ మోడల్.

తాను నిత్యం వండే “పప్పు – పచ్చడి – సాంబార్”లనే ఓ ఫార్ములాతో .. “ఒకే రంగు ఒకే రుచి ఒకే చిక్కదనం” ఉండేలా ఉచిత శిక్షణ పొంది… దానికి సంస్థ అందించే సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రమోషన్ తో ఆర్డర్ లు పొంది నిర్ణీత సమయంలో రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి అందివ్వడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబానికి అండగా నిలవాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న “షీరో హోమ్ ఫుడ్” అత్యంత ప్రతిభను కనబరిచిన మహిళను షీరో కిరీటంతో సత్కరించే ఉద్దేశంతో ప్రతి ఏడాది “షీరో అవార్డ్స్” కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దక్షిణాది 5 రాష్ట్రాల మహిళలు పోటీ పడగా, ఈ ఏడాది “షీరో కిరీటం” తెలుగు మహిళ “సునీత ప్రసాద్ మాలెంపాటి”కి దక్కింది!!

హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కాలేజ్ ఆడిటోరియంలో సినీ మరియు సేవా రంగానికి చెందిన ప్రముఖులు విచ్చేసిన ఈ షీరో అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ నటీ నటులు మురళీ మోహన్, సుమన్, ఆమని, అశోక్ కుమార్, గౌతమ్ రాజు, కృష్ణుడు, సిద్దార్థ్ వర్మ, విష్ణు ప్రియ, సుధా రెడ్డి మరియు సేవా రంగానికి చెందిన అను ప్రసాద్, కరుణశ్రీ, ప్రవీణా నాయుడు తోటా, చైతన్య జంగా విచ్చేసి మహిళల స్వయం ఉపాధికి, మహిళా సాధికారతకు బాటలు వేస్తున్న షీరో సంస్థకు అభినందనలు తెలిపారు. మహిళల అభ్యున్నతియే లక్ష్యంగా ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని సంస్థ వ్యవస్థాపకులు తిలక్ వెంకట స్వామి, జయశ్రీ తిలక్ పేర్కొన్నారు!!

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే మూడు వందల మహిళలకు ఉపాధి అందిస్తున్నామని, రాబోయే ఐదు సంవత్సరాలలో పది వేల తెలుగు మహిళలకు ఈ అవకాశం కల్పించనున్నామని తెలుగు రాష్ట్రాల ప్రతినిధి సువర్ణ దేవి పాకలపాటి పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ ఈసారి తెలుగు రాష్ట్రానికి చెందిన మహిళకు దక్కడం తెలుగు మహిళలు అందరికి గర్వకారణం అని సినీ నటి ఆమని తెలిపారు!!

Related posts