telugu navyamedia
క్రీడలు వార్తలు

మరోసారి తెరపైకి ఫ్రీ బాల్ వివాదం…

భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ రాసిన ఓ కథనాని స్పందిస్తూ అతను ఈ కామెంట్స్ చేశాడు… కొన్ని నిబంధనలతో బౌలర్లకు అన్యాయం జరుగుతుందన్నాడు. అందులో ఫ్రీ హిట్ ఒక్కటని, దాన్ని రద్దు చేయాలనే అభిప్రాయపడ్డాడు. ఇక ఈ కథనాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్న సంజయ్ మంజ్రేకర్.. అభిప్రాయం చెప్పాలని క్రికెటర్లను, విశ్లేషకులను కోరాడు ‘ఫ్రీహిట్‌’ అనేది పోవాలి. అది బౌలర్లకు తీరని అన్యాయం చేస్తుంది’అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన అశ్విన్.. తన ఫ్రీబాల్ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. ‘కమాన్‌ సంజయ్‌, ఫ్రీహిట్‌ అనేది గొప్ప మార్కెటింగ్‌ టూల్‌. అభిమానులు దానికి ఆకర్షితులయ్యారు. అందుకే నాన్‌స్ట్రైకర్‌ బంతి వేయక ముందే క్రీజు దాటిన ప్రతిసారీ ఫ్రీ బాల్‌ ఇవ్వాలి. ఆ బంతికి వికెట్‌ రావాలి లేదా పది పరుగులను స్కోరు నుంచి తీసేయాలి’ అని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ‘గుర్తుంచుకోండి.. బంతి చేతుల్లోంచి వదిలాకే నాన్‌స్ట్రైకర్‌ క్రీజు దాటాలి’అని మరో ట్వీట్ చేశాడు. అయితే అశ్విన్ ప్రతిపాదనను మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా వ్యతిరేకించాడు. ఫ్రీబాల్‌కు 10 పరుగులు తీసేయడం సమంజసం కాదన్నాడు. ‘ఈ ప్రతిపాదనకు నేను అంగీకరించను. ఫ్రీబాల్‌కు వికెట్‌ పడితే ఫర్వాలేదు. లేదంటే అది డాట్‌ బాలే (10 పరుగులు తీసేయకూడదు)’ అని అశ్విన్‌కు బదులిచ్చాడు. ‘న్యాయమేంటో చర్చిద్దాం! సమన్యాయం ఉండాలన్న తపనను మాత్రం కొనసాగిద్దాం. మీ నుంచి వచ్చిన ఆ స్ఫూర్తిని ప్రేమిస్తాను’ అని ఈ సీనియర్ స్పిన్నర్ బదులిచ్చాడు. దాంతో ఫ్రీ హిట్- ఫ్రీబాల్ అనే టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Related posts