telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

high court on new building in telangana

తెలంగాణ ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు, రూట్ల ప్రైవేటీకరణపై మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా తప్పవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది.

మోటారు వెహికిల్ యాక్ట్ సెక్షన్-67 ను అనుసరించి ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని స్పష్టం చేసింది. రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయరాదని ఏ చట్టమైనా చెబుతోందా? అంటూ ప్రశ్నించింది. అయితే, ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా వెళతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేనప్పుడు, తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Related posts