telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

5 వేల మంది రైతులతో కేసీఆర్ సమావేశం

Kcr telangana cm

ఈ నెల 31న జనగామ జిల్లాలో రైతు వేదికను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు కొండగండ్లలో వేదిక నిర్మాణ పనులు పూర్తి చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు సీఎం కేసీఆర్‌ రైతు వేదికను ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటుచేసే సభలో కేసీఆర్‌ మాట్లాడతారు. అనంతరం రైతు వేదిక వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటలపై చర్చించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోంది. ఆన్‌లైన్‌లో సీఎం కేసీఆర్ నేరుగా రైతులతో మాట్లాడేలా.. రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 వేదికలను నిర్మిస్తున్నారు. సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌గా ఈ వేదికలను ఉపయోగించనున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి.. 2,604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిధులను కూడా కేటాయించింది. పలు చోట్ల వేదిక నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మరికొన్ని చోట్ల శరవేగంగా పనులు సాగుతున్నాయి.

Related posts