ఏపీ సీఎం జగన్ పై నటుడు ఆర్.నారాయణమూర్తి మరోసారి ప్రశంసలు కురిపించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్న ‘సీఎం జగన్ కు హ్యాట్సాప్’ అని ప్రశంసించారు.
తెలుగు భాషను కాపాడాలంటున్న వాళ్లు, మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెబుతున్న వాళ్లు తమ పిల్లల్ని మాత్రం కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారని విమర్శించారు. తమ తరంలో ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న వాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారని చెప్పిన నారాయణమూర్తి, తెలుగు మీడియంలో చదువుకుంటే బడుగు, బలహీనవర్గాల పిల్లలు బంట్రోతులు అవుతారని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ భయపడుతోంది: యనమల