telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : బండి సంజయ్

ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని అన్నారు. ఎంజీఎం, కరీంనగర్ సివిల్ ఆస్పత్రి ఎది చూసిన బాధ కలుగుతుంది అని . అక్కడ కోవిడ్ వార్డుల్లా లేవు… సాధారణ వార్డుల కంటే అధ్వానంగా వుంది అని తెలిపారు.  సిబ్బంది కోరత వేధిస్తుంది. ఆస్పత్రిలో వైద్యురాలు శోభరాణీ అలాగే 4 లాబ్ టెక్నీషియన్లు మృతి చెందారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది పై పని భారం పడుతుంది. వైద్య సిబ్బంది, పార మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది కి నిన్సెంట్యుస్ ఇవ్వండి. మానవత ఉద్దేశంతో సేవలు అందించే వారి కుటుంబాలను ఆదుకోవాలి. మేము రాజకీయ కోణంలో విమర్శించడం లేదు. అన్ని విధాల సహకరిస్తాము అని అన్నారు. వారికి కుటుంబాలు వున్నాయి. మరణాల సంఖ్య కరోనా బాధితుల సంఖ్య తక్కువ చేసి చూపుతున్నారు. PM కేర్స్ పండ్ నుంచి 100 వెంటిలేటర్స్ కేంద్రం ఇచ్చిన వాటిని వినియోగించ లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. PPE కిట్లు లేవు. సర్జికల్ మాస్క్ లు లేవు. రేమిడిసివర్ ఇంజెక్షన్ల కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తుంది.పేషంట్లను కాపాడే ప్రయత్నం చేయండి అని పేర్కొన్నారు.

Related posts