telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బెంగళూరులో మాజీ మంత్రి మణికందన్ అరెస్ట్

తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ బెంగళూరు లో అరెస్ట్ అయ్యాడు. నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో పరారీలో ఉన్నారు మాజీ మంత్రి మణికందన్. అయితే బెంగళూరు లో మణికందన్ ని నేడు అరెస్ట్ చేసారు తమిళనాడు పోలీసులు. సినీ నటి చాందినిని పెళ్ళిచేసుంటానని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపాడు మణికందన్. ఈక్రమంలో సినీ నటి చాందిని మణికందన్ తనని మోసం చేసాడని, పెళ్ళి చేసుకోమని అడిగితే చంపేస్తానని రౌడీలతో బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాందిని విడుదల చేసిన మాజీ మంత్రి మణికందన్ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. చూడాలి మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది.

Related posts