telugu navyamedia
క్రీడలు వార్తలు

పైన్ కు దీప్‌దాస్‌ కౌంటర్…

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ చేసిన వ్యాఖ్యలపై దీప్‌దాస్‌ గుప్తా కౌంటర్ ఇచ్చాడు. భారత్‌ మైండ్‌గేమ్స్‌ ఆడడం, పక్కదారి పట్టించడం తానెప్పుడూ చూడలేదనన్నారు. సిరీస్ ముగిసి చాన్నాళ్లు అయిన తరవాత టీమిండియా పక్కదారి పట్టించి తమను ఓడించిందని పైన్‌ చేసిన వ్యాఖ్యలు తనను విస్మయం కలిగించాయని దీప్‌దాస్‌ పేర్కొన్నారు. తాజాగా దీప్‌దాస్‌ గుప్తా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘టిమ్‌ పైన్‌ సాకులు చెబుతున్నాడని నేను అనుకోను. జట్టు ఓటమి పాలైన కొన్ని నెలల తర్వాత అతడు ఈ విషయంపై మాట్లాడాడు. పైన్‌ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడా అన్నది పక్కన పెడితే.. భారత్ పక్కదారి పట్టించిందనడం విస్మయం కలిగించింది. నిజానికి బంతిపై దృష్టి పెట్టలేకపోవడం వాళ్ల తప్పే. క్వారంటైన్‌ అంశంలో నిజాయితీ ఉంది. గబ్బా టెస్టుకు ముందు జట్టును ఐసోలేషన్‌లో ఉండమన్నారు. ఆటగాళ్లు, జట్టు నిర్వహణ మరియు కోచింగ్ సిబ్బంది ఎవరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడలేదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. చాలాసార్లు వదంతులు రావడం చూస్తూనే ఉంటాం’. ఇంతకు అధికారిక ప్రకటనే లేనప్పుడు ఆసీస్‌ కెప్టెన్ దేని గురించి మాట్లాడుతున్నాడు?. ఇంతకు అతడి మాట ఎవరు వింటున్నట్టు? నిజానికి వాళ్ల ఓటమి స్వయంకృతం. 30 ఏళ్ల తర్వాత గబ్బాలో ఓడిపోయారు. టీమిండియాకు ప్రధాన ఆటగాళ్లు లేకున్నా.. భారత్ చేతిలో వరుస సిరీసులు కోల్పోయారు. దీన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బంతిపై దృష్టి పెట్టలేకపోవడం వాళ్ల తప్పే ​అని అన్నారు

Related posts