telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Nirmalasitaraman

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం పండుగ ఆఫర్ ను ఇచ్చింది. ఎల్టీసీ క్యాష్ వోచర్లు, పండుగ అడ్వాన్సులు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 12%, ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఎల్టీసీ నగదును వ్యయం చేయాలనీ ఆమె విజ్ఞప్తి చేసారు. ఆయా చెల్లింపులను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా చేయాలనీ తెలిపారు. వీటికి సంబంధించిన జీఎస్టీ ఇన్వాయిస్ సమర్పించాలని పేర్కొన్నారు. వోచర్లను ఎక్కడైనా.. ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు వినియోగించేలా అవకాశాలు కల్పిస్తున్నామని ఆమె వెల్లడించారు. తమకు నచ్చిన ప్రాంతానికి, తమ సొంత ఉరికి వెళ్లేందుకు ఎల్టీసీ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

వీటిపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని స్పష్టం చేసారు నిర్మలా సీతారామన్. కరోనా కారణంగా డిమాండ్ భారీగా పడిపోవడంతో పండుగ సమయంలో కేంద్రం ఈ ప్యాకెజీని ప్రకటించింది. ఇక ఈ ఓచర్లతో పాటు ప్రతి అడ్వాన్సు కూడా అందించనుంది. విహారయాత్రలు లేదా సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం నాలుగేళ్ళకొకసారి ఉద్యోగులకు ఈ వెసులుబాటు అందించింది. ఇక ఎల్టీసీ సౌకర్యాన్ని కూడా నగదు ఓచర్ల రూపంలోకి మార్పు చేసారు. వీటిని 2021 మార్చ్ 31 వరకు ఉద్యోగులు వినియోగించుకోవచ్చు.

Related posts