telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

భార్యను అవమానించాడని… మద్యం మత్తులో…

Lee

బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబం పార్టీ చేసుకుందామని మిత్రులతో కలిసి బయటకు వెళ్లింది. పార్టీ ముగించుకొని తిరిగి వస్తుండగా… ఆ కుటుంబానికి చెందిన లీ, కార్ల్ ఎల్డ్రెడ్ అనే సోదరుల మధ్య వాగ్వివాదం మొదలైంది. వారిని ఆపడానికి వారి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇంతలో కార్ల్ భార్యను లీ అవమానించాడు. దీంతో చిర్రెత్తిన కార్ల్ లీ తలపై దెబ్బల వర్షం కురిపించాడు. అసలుకే మత్తు ఎక్కువైపోయి ఉన్న లీకి ఆ దెబ్బలకు కూర్చున్న చోటే కళ్లు తేలేశాడు. కంగారుపడిన వాహనంలోని వారు వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. వెంటనే అతన్ని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మద్యం మత్తు ఎక్కువ కావడం లీ మరణానికి కారణమని వైద్యులు చెప్పడంతో కోర్టు కార్ల్‌కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది.

Related posts