telugu navyamedia
తెలంగాణ వార్తలు

పెర‌గ‌నున్న ఆర్టీసీ ఛార్జీలు..

సామాన్యులకు భారింత భారం ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు అకాశానికి అంటుతున్నాయి. దాంతో పాటు పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్, కూరగాయలు ఇలా సామాన్యుడి అత‌లాకుత‌లం చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో మ‌రో షాక్‌..బస్సు ఛార్జీలను పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పెరిగిన డీజిల్‌ భారం నుంచి బయట పడాలంటే చార్జీలు స్వల్పం పెంచాలని భావిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చేందుకు చాలా ఇబ్బందులు పడుతోంది. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచక ప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ క్ర‌మంలో ఆర్టీసీపై డీజిల్‌ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో చార్జీలు పెంచాల‌ని ఆర్టీసీ అధికారులు నేరుగా సీఎంకు పరిస్థితిని వివరించారు. వచ్చే కేబినెట్ మీటింగ్‌లోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.

త్వరలోనే దీనిపై కేబినెట్‌లో నిర్ణయం జరగబోతోంది.. ఏమేరకు పెంచాలనే అంశంపై అధికారులు ఇవాళ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులతో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఛార్జీల పెంపు తప్పనిసరి అని తెలుస్తోంది.

Related posts