నాగబాబు షో నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నారు అంటూ బుల్లి తెర వర్గాల్లో కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా పలు మీడియాల్లో ఈ విషయం ప్రముఖంగా వినిపిస్తుంది. జబర్దస్త్ ప్రొడక్షన్ హౌస్ మల్లెమాల వాళ్ళతో డైరెక్టర్స్ భరత్, నితిన్ లు విభేదాల కారణంగా షో కు దూరం అయ్యారట. వారితో మంచి బాండింగ్ ఉన్న నాగబాబు కూడా బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇక మరో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో ఈ బ్యాచ్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా కూడా సమాచారం. జబర్దస్త్ నుండి నాగబాబు తో మరి కొందరు కమెడియన్స్ కూడా వెళ్తారనే టాక్ వినిపిస్తుంది. నాగబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సుడిగాలి సుధీర్.. హైపర్ ఆది, చమ్మక్ చంద్రలతో పాటు ఇంకొందరు కమెడియన్స్ కూడా బయటకు రాబోతున్నారట. ఇంతమంది జబర్దస్త్ నుండి బయటకు వస్తే జబర్దస్త్ కి చెల్లు చీటీనేనని చెప్పుకుంటున్నారు.
మరో కామెడీ షో పటాస్ లో కూడా సంచలన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే శ్రీముఖి తప్పుకోవడంతో రేటింగ్ బాగా పడిపోయిన సంగతి తెలిసిందే. అందువల్లే యాంకర్ రవి కూడా మెల్లగా పటాస్ నుండి తప్పుకోవాలని చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళతో ఒక ఛానెల్ చర్చలు జరుపుతుందని జబర్దస్త్, పటాస్ లాంటి ఒక మాంచి ఎంటర్ టైన్ మెంట్ పోగ్రాంను డిజైన్ చేసే పనిలో ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. మరి జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన వారు షో ను ప్రారంభించినంత మాత్రాన ఆ షో సక్సెస్ అవుతుందా..!