telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా… గెటప్ శ్రీను వార్నింగ్

Sreenu

జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఫేక్ అకౌంట్లపై గెటప్ శ్రీను ఫైర్ అయ్యాడు. తన పేరుతో ఎవరో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి యాంటీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని ఈ జబర్దస్త్ కమెడియన్ లైవ్ వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ వీడియో చేసిన శ్రీను.. తనకు సోషల్ మీడియాలో ఉన్నది కేవలం రెండు అకౌంట్లు మాత్రమేనని.. అందులో ఒకటి పర్సనల్ అయితే.. మరొకటి పేజ్ అని తెలిపాడు. ఈ రెండు కాకుండా ఎవరో గెటప్ శ్రీను పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారని చెప్పాడు. దానితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు.

Related posts