telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహమ్మద్ అలీ జిన్నా కొత్త అవతారమే… ఈ ఒవైసీ

bjym జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం అంత హైదరాబాద్ వైపు చూస్తోందని…దేశంలోనే తెలంగాణ యువత టాలెంట్, హార్డ్ వర్కింగ్ యువత అని తెలిపారు. కానీ.. ఇక్కడి ప్రభుత్వం ఒక్క ఫ్యామిలీ కోసమే పనిచేస్తుందని…నేనొక సామాన్య కార్యకర్తను .. నన్ను బీజేపీ పార్టీ జాతీయ నేతను చేసిందన్నారు. ప్రజాస్వామ్యం అనే అర్థాన్ని ఇక్కడ మార్చారని… ప్రజాస్వామ్యం అంటే ఒక్క ఫ్యామిలే కోసమే రాజకీయాలను ప్రైవేట్ కంపెనీలుగా మార్చారని ఫైర్‌ అయ్యారు. ప్రజాస్వామ్యం నిజమైన అర్థాన్ని ఇక్కడ తీసుకురావాల్సి ఉందని..దేశం కుటుంబ రాజకీయాల్ని తిరస్కరిస్తుందన్నారు. ఒవైసి కి ఇక్కడ ఓటు వేస్తే ఆయన మహారాష్ట్ర, బీహార్, యూపీ, కర్ణాటక ల్లో బలోపేతం అవుతాడని… మహమ్మద్ అలీ జిన్నా కొత్త అవతారమే.. అసదుద్దీన్ ఒవైసీ అని మండిపడ్డారు. ఈ దేశాన్ని ఇస్లామీకరణ కానివ్వమని…అక్బరుద్దీన్, అసద్దుద్దీన్ ఇది నిజాం కాలం కాదన్నారు. Mim ఒక్కటే దేశాన్ని పాకిస్తాన్ కావాలని అనుకుంటుందని.. అందుకే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు. మేము హైదరాబాద్ ని ఇస్తాంబుల్ చేయము.. మేము హైదరాబాద్ ని భాగ్యనగర్ చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts