telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్‌పై గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం..

Harshavardhan Central Minister

వచ్చే ఏడాది సెప్టెంబరు కల్లా దేశంలోని 30 కోట్ల మందికి “వాక్సిన్” లభ్యం అవుతుందని  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ తెలిపారు. భారత్ వైపు పలు కంపెనీలు చూస్తున్నాయని.. “వాక్సిన్” పనిచేసే సామర్థ్యం, ఆరోగ్య భద్రత” లనే రెండు అంశాలు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు కేంద్రమంత్రి. ముందుగా వైద్య, ఆరోగ్య సిబ్బందికి “వాక్సిన్” ఇవ్వనున్నామని…. దేశంలోని వైద్య, ఆరోగ్య సిబ్బంది సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. 65 ఏళ్ల పైబడిన వారికి, “కరోనా” కట్టడిలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీసులు, పారామిలటరీ దళాలు, పారిశుధ్య కార్మికులకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో 50 ఏళ్లు పైబడిన వారికి, ఒకటికి మించి పలు రుగ్మతలతో, జబ్బులతో బాధపడుతున్న వారికి
“వాక్సిన్” ఇస్తామని తెలిపారు. దేశ రాజధానిలో విజృంభిస్తున్న “కరోనా” కట్టడికి, ఢిల్లీ రాష్ట్రానికి కేంద్రం అండ దండలు ఉంటాయన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున టెస్ట్ లు నిర్వహించేందుకు అన్నిరకాలుగా రాష్ట్రానికి కేంద్రం సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు.

Related posts