telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నానికి నో చెప్పిన రష్మిక… కారణం ఇదే…!

Rashmika

నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని వరుసగా సినిమాలు చేసేందుకు సైన్ చేశారు. ఇప్పటికే ‘టక్ జగదీష్’ అనే చిత్రం లైన్‌లో పెట్టిన నాని, రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్‌ కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. లేదంటే ఇప్పటికే సెట్స్‌పై ఉండేది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ల గురించి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. నాని మూడు వైవిధ్య కోణాల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. కథానుసారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు స్థానం ఉందట. మూడూ కీలక పాత్రలేనట. వీటిలో ఒకదానికి సాయిపల్లవి ఫిక్స్ అయిందట. మరో పాత్ర కోసం రష్మికను సంప్రదించారట. అయితే ఆమె నిరాకరించినట్టు సమాచారం. మెయిన్ లీడ్ అయితే తప్ప ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల్లో నటించకూడదని రష్మిక నిర్ణయించుకుందట. రెమ్యునరేషన్ భారీగా ఆఫర్ చేసినా, తన పాత్రకు తగినంత ప్రాధాన్యం ఉన్నా సరే రెండో హీరోయిన్ పాత్ర మాత్రం చేయకూడదని రష్మిక ఫిక్స్ అయిందట. అందుకనే నాని `శ్యామ్ సింగరాయ్`ను తిరస్కరించినట్టు సమాచారం.

Related posts