ముంబయి నుంచి గోవా వెళుతున్న ఒక క్రూయిజ్ షిప్ లో ఆదివారం అర్థరాత్రి జరిగిన పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు దాడి చేశారు. ఆ షిప్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఎన్సీబీ అధికారులు అధిక మొత్తంలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎండీఎంఏ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎన్‌సీబీ ప్రకటించింది. వారిలో ఇద్దరు అమ్మాయిలు తో పాటు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ , అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచా, నూపూర్ సారిక, ఇస్మిత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలు ఉన్నారని ఎన్‌సీబీ ప్రకటించింది.
ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఇందులో ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.ఈ డ్రగ్స్ కేసులో న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని , దీని వెనుక బాలీవుడ్ ప్రముఖులు, ధనవంతుల కనెక్షన్లు ఉన్నా లెక్క చేయం. మేం చట్టప్రకారం నడుచుకుంటాం”అని ఎన్‌సీబీ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు.
కాగా.. గతంలో సిమి గేర్‌వాల్ ఇంటర్వ్యూలో భార్య గౌరీ ఖాన్‌తో కలిసి షారుక్ తన కుమారుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేను యవ్వనంలో చేయలేని పనులన్నీ నా కొడుకు ఆర్యన్ చేయాలి. అమ్మాయిలతో డేటింగ్, సిగరెట్, సెక్స్ మరియు డ్రగ్స్ ని కూడా తీసుకోవచ్చు. తాను అన్ని రకాలుగా ఎంజాయ్ చేయవచ్చు”. షారుఖ్ ఖాన్ సరదాగా మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.