యు.కె. ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం “అప్పుడు-ఇప్పుడు”. చలపతి పువ్వల దర్శకుడు. సుజన్, తనీష్క్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, శివాజీరాజా, ‘మళ్లీ రావా’ ఫేమ్ పేరుపు రెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దసరా పండుగా సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ.. “మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్‌తో వస్తోన్న ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. సుజన్, తనీష్క్ ఇద్దరూ చాలా బాగా నటించారు. అందరూ కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మా నిర్మాతలు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్ర విజయంపై మా టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం” అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “విజయదశమి రోజున మా చిత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా దర్శకుడు చలపతి పువ్వల కొత్తవారైనా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమా కోసం ఎంతో ఇష్టంగా వర్క్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అన్నారు.