ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలు ప్రముఖుల జీవిత చరిత్రలను సినిమాల రూపంలో తెరకెక్కించారు. మరికొన్ని బయోపిక్స్ రూపొందుతున్నాయి. లేటెస్ట్‌గా పరుగుల రాణి పి.టి.ఉష బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో పి.టి.ఉష పాత్రలో కత్రినా కైఫ్‌ను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపించాయి. ఈ విషయం గురించి కత్రినా కైఫ్‌ను ప్రశ్నించినప్పుడు “నాకు సరిపోయే కథైతే తప్పకుండా నటిస్తాను. సినిమాకు సంతకం పెట్టక ముందే మాట్లాడటం సరికాదని నా అభిప్రాయం” అని అన్నారు కత్రినా కైఫ్.
previous post