telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీహరి కొడుకుతో రాజశేఖర్ కుమార్తె సినిమా

Meghamsh-and-Shivathmika

హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ హీరోగా రంగ ప్ర‌వేశం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రం `రాజ్‌దూత్‌` పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుద‌ల కాక ముందే మేఘాంశ్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మైంది. `రాజ్‌దూత్‌` చిత్రాన్ని నిర్మిస్తున్న ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణే, మేఘాంశ్ నెక్ట్స్ మూవీని కూడా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత రెండో త‌న‌య శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. కొస‌మెరుపు ఏంటంటే జీవిత‌, రాజ‌శేఖ‌ర్ మొద‌టి కుమార్తె శివాని రాజ‌శేఖ‌ర్ న‌టించిన `2స్టేట్స్‌` సినిమాకు కూడా పి.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణే నిర్మాత‌.

Related posts