telugu navyamedia
సినిమా వార్తలు

ఈ సాంగ్ ప్రతి విజయవంతమైన మహిళలకు అంకితం

Kausalya

ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగు డెబ్యూ చిత్రం “కౌస‌ల్య కృష్ణ‌మూర్తి” ఆగష్టు 23న విడుదల కాగా, ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళుతుంది. రైతుల సమస్యను, క్రికెటర్‌గా ఎదుగాలనుకొన్న యువతి కథను అద్భుతంగా మేళ‌విస్తూ చిత్రాన్ని రూపొందించార‌ని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. క్రికెట్‌ పురుషుల ఆట అని భావించే ఈ రోజుల్లో ఒక యువతి తన చిన్ననాటి కలని సాకారం చేసుకుని తండ్రి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఏమి చేసింది అనే దానిని “కౌసల్య కృష్ణమూర్తి” చిత్రంలో చూపించారు దర్శకుడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన “కౌస‌ల్య కృష్ణ‌మూర్తి” చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్ సాధించ‌డ‌మే కాకుండా ప‌లువురు ప్ర‌ముఖుల నుండి ప్ర‌శంస‌లు అందుకుంది. ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌, సి.వి.ఎల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస‌రావు తెర‌కెక్కించారు. తాజాగా చిత్రం నుండి రేప‌టి క‌ల అనే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ని దేశం కోసం నిలబడే ప్రతి విజయవంతమైన మహిళలకు అంకితం చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం పేర్కొంది.

Related posts