telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కార్తికేయ-2″లో నిఖిల్ పాత్ర రివీల్

Nikhil

వైవిధ్యమైన సినిమాలతో యంగ్ హీరో నిఖిల్ తనకంటూ ఓ సొంత ఇమేజ్ ఏర్పరచుకున్నారు. నిఖిల్ ఎంచుకునే కథ, కథనాలే కాదు వాటిల్లో పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఇక నిఖిల్ – డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయకి ఇటీవలే సీక్వెల్ పనులు మొదలు అయ్యాయి. ‘కార్తికేయ 2’ టైటిల్‌తో రెడీ అవుతున్న ఈ సినిమాలో నిఖిల్ డాక్టర్‌గా నటిస్తున్నారు. ‘కార్తికేయ’లో మెడికల్ స్టూడెంట్‌గా నటించిన నిఖిల్ ఇప్పుడు ఈ సీక్వెల్‌లో డాక్టర్‌గా కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని ‘కార్తికేయ 2’ చిత్ర బృందం తెలియజేశారు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ లుక్‌లో నిఖిల్ మేడలో స్టేథస్ స్కోప్ ఉంది. అలానే వైద్యో నారాయణో హరి – వైద్యుడే నారాయణుడు – నారాయణుడే వైద్యుడు అని ఒక శ్లోకాన్ని దాని అర్థాన్ని కూడా ఈ పోస్టర్ లో పెట్టారు..! ఐతే ఇదే పోస్టర్‌తో కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ చందు మొండేటి మరియు చిత్ర బృందం.

Related posts