పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ , రానా నటించిన సినిమా ఈ నెల 25న విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. అయితే ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని నటుడు నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం పగ పట్టిందని మండిపడ్డారు.
టికెట్ ధరల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని గ్రహించిన సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఫిబ్రవరి 20న జీవో వస్తుందన్నారు. కానీ.. రాలేదు. కల్యాణ్ బాబు సినిమా (భీమ్లా నాయక్) 25న విడుదల అని ప్రకటన రాగానే ఆలస్యం చేశారు. పాత రేట్లు అమలు చేశారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ అనే హీరోని టార్గెట్ చేశారని మాకు క్లియర్ కట్ గా అర్థం అయ్యింది” అని నాగబాబు అన్నారు.
పవన్‌పై పగతో ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు పవన్‌కు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
నిర్మాతలు, దర్శకులు, హీరోలకు ఇది తప్పు అని చెప్పడానికి ఎందుకు ధైర్యం చాలడం లేదు. ఒక అగ్ర హీరోకే ఇంత జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ అని నాగబాబు ప్రశ్నించారు..
సినీ పరిశ్రమ భయాన్ని, అభద్రతా భావాన్ని పవన్ అర్థం చేసుకుంటున్నాడు. ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా ఇలాంటి సమస్య వస్తే మేం ముందుటాం అని అన్నారు.
మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వంలోనే ఉండేది ఐదేళ్లేనని వైఎస్సార్‌సీపీ గుర్తించాలని అన్నారు. ప్రజలు మీకు శాశ్వత అధికారం ఇవ్వలేదు. మళ్లీ ప్రజాక్షేత్రంలో నిల్చొని ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి’ అని చెప్పుకొచ్చారు నాగబాబు.
హీరోయిన్ సాయిపల్లవిపై కేసు నమోదు..