telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీలో చేరిన రాములమ్మ…

ఎట్టకేలకు విజయశాంతి బీజేపీ పార్టీలో చేరారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. విజయశాంతికి బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్పానించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. విజయశాంతికి పార్టీ సభ్యత్వ రసీదును అందజేశారు అరుణ్ సింగ్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. టీఆర్ఎస్ కోసం ఎవరు ఉండకూడదు, ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో కేసీఆర్‌ వ్యవహరించారని… తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేయమని నాపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. కేసీఆర్ కన్నా నేను ముందుగా తెలంగాణ కోసం పోరాడానని… టీఆర్ఎస్ నుంచి ఇద్దరం ఎంపీలుగా గెలిచామన్నారు. 2013 లో జూలైలో, అదే రాత్రి నన్ను సస్పెండ్ చేశారని.. ముందు నుంచే నాపై కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారని ఫైర్‌ అయ్యారు. నేనే పార్టీ నుంచి బయటకు వెళ్లానని ప్రచారం చేశారని… తెలంగాణ ఇస్తే TRS ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాకు చెప్పారని గుర్తు చేశారు. కానీ, అప్పుడు కేసీఆర్‌ “యూటర్న్”తీసుకున్నారని… తెలంగాణ లో కొట్లాడే నేతలు ఉండకూడదన్న యోచనలో కేసీఆర్ అందర్నీ టి.ఆర్.ఎస్ లో చేర్చుకున్నారని మండి పడ్డారు. కానీ, ప్రస్తుతం తెలంగాణ లో టీఆర్ఎస్ కు బిజేపి ప్రత్యామ్నాయంగా ఎదిగిందని.. కేసీఆర్ ను గద్దె దించుతాం, ఆయన అవినీతిని బయట పెడతామని హెచ్చరించారు. తెలంగాణ లో అత్యధికంగా అవినీతి జరుగుతోందని… రేపు తెలంగాణలో రాబోయేది బిజేపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. విజయ శాంతి ఎక్కడ ఉన్న కీలక పాత్రే పోషిస్తుందని తెలిపారు.

Related posts