ఏడేళ్ల క్రితం విడుదలైన `యే జవానీ హై దివానీ` సినిమా జ్ఞాపకాలను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తాజాగా సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, దీపిక కలిసి నటించారు. 2013లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమయానికి రణ్‌బీర్, దీపిక ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. రణ్‌బీర్ నుంచి విడిపోయిన దీపిక.. రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. `యే జవానీ హై దివానీ` విడుదలై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను దీపిక గుర్తు చేసుకుంది. ఆ సినిమా ఫస్ట్‌లుక్ టెస్ట్ కోసం రణ్‌బీర్‌తో కలిసి తీయించుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రణ్‌బీర్, దీపిక కెమిస్ట్రీపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. దీపిక భర్త రణ్‌వీర్ కూడా స్పందించాడు. `క్యూట్` అని కామెంట్ చేశాడు. రణ్‌వీర్ కామెంట్‌కు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.
previous post
next post