telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపటి నుండి కార్మికులు విధులలో చేరవచ్చు.. : కేసీఆర్

kcr meeting on tsrtc protest report

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో టీఎస్ఆర్టీసీ చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తుపై కీలక నిర్ణయంతీసుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం, వాణిజ్య సముదాయాల అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై మంత్రివర్గం చర్చించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ మరియు మెదక్ జిల్లాలలోని కొన్ని విలువైన ఆస్తులను ఆర్టీసీ ఇప్పటికే వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన తరువాత, హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో యాజమాన్యం ఆస్తులపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇక సీఎం కేసీఆర్ ఆర్టీసీ అంశంపై లైవ్‌లో మాట్లాడుతున్నారు..

ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేదే కానీ ఎవరి పొట్టలు కొట్టేది కాదని, దేశం మొత్తంలో చూసుకుంటే.. తెలంగాణాలో మాత్రమే ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అన్నారు. యూనియన్ల మాటలు విని ఆర్టీసీ కార్మికులు పెడదారి పడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలిట రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు ఆర్టీసీని విలీనం చేయలేదన్నారు. ఆర్టీసీ సమ్మె, దాని పరిణామాలకు యూనియన్లదే పూర్తి బాధ్యతని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం ముందు నుంచీ విధుల్లో చేరమని చెప్పినా.. ఎవరూ వినలేదన్నారు. యూనియన్లు లేనిపోని ఆశలు కల్పించి కార్మికులను బలిపశువులు చేశారని అన్నారు. రేపటి నుంచి కార్మికులు విధుల్లోకి చేరమని కేసీఆర్ శుభవార్త అందించారు.

Related posts