telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు వర్మ బర్త్ డే గిఫ్ట్…!?

RGV

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలకంటే కాంట్రవర్సీలతోనే బిజీగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన “పవర్ స్టార్” పేరుతో ఓ సినిమాను తీస్తానని ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఆర్జీవీ తాజాగా మరో ప్రకటన చేసాడు. అదేంటంటే..తాను తెరకెక్కించబోయే “పవర్ స్టార్” సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు… కాగా ఆర్జీవీ రెండు నెలల్లో సినిమాను పూర్తి చేస్తాడా? లేదంటే ఇదివరకు టైటిల్స్ విడుదల చేసి ఉరుకునట్టుగానే ఊరుకుంటాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇప్పటికే వర్మ ఆ సినిమాలో నటించబోయే హీరోకి సంబందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. “ఇతడే నా పవర్ స్టార్. ఈ వీడియో చూసాక మీకు ఎవరైనా గుర్తుకు వస్తే అది మీ ఊహకే వదిలేస్తున్నా” అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా ఆ వీడియోలో ఉన్న నటుడు అచ్చం పవన్ కళ్యాణ్ రూపురేఖలతో ఉండటమే కాకుండా..వాకింగ్ స్టైల్ కూడా ఆయనలానే ఉంది.

Related posts