telugu navyamedia
సినిమా వార్తలు

ఆ వార్తల్లో నిజం లేదు : సురేష్ ప్రొడక్షన్స్

Venkatesh

ఈ ఏడాది సంక్రాంతికి “ఎఫ్‌-2” సినిమాతో విక్ట‌రీ వెంక‌టేష్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి వెంకీ చేసిన ఆ సినిమా రికార్డు స్థాయిలో భారీ క‌లెక్ష‌న్లు సాధించిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న అక్కినేని నాగ‌చైత‌న్య‌తో క‌లిసి “వెంకీ మామ‌” సినిమాలో న‌టిస్తున్నారు. తాజాగా వెంకీ మ‌రో సినిమాకు ఓకే చెప్పిన‌ట్టు వార్తలు వచ్చాయి. తమిళంలో విజ‌యం సాధించిన “విక్ర‌మ్‌వేద‌” తెలుగు రీమేక్‌లో నారా రోహిత్‌తో క‌లిసి వెంకీ న‌టించ‌బోతున్న‌ట్టు ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వార్త‌పై సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ట్విట‌ర్ ద్వారా స్పందించింది. ఆ వార్త నిజం కాద‌ని స్ప‌ష్టం చేసింది. “విక్ర‌మ్ వేద‌” తెలుగు రీమేక్‌లో వెంక‌టేష్ న‌టించ‌బోతున్న‌ట్టు మీడియాలో వ‌స్తున్న వార్త నిజం కాదు. ప్ర‌స్తుతం ఆయ‌న “వెంకీమామ‌” సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌ర్వాత సినిమా వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

Related posts