దక్షిణాది పరిశ్రమలో అగ్రనటి సమంత. ఆమెకి సంబంధించిన ఏ పోస్ట్ అయిన కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతుంది. ఇటీవల సమంత మార్కుల మెమో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. స్కూల్, కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులు అందరిని షాక్‌కి గురి చేశాయి. సీఎస్‌ఐ సెయింట్ స్టీఫెన్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో సమంతకు పదో తరగతిలో గణితం-పార్ట్-1 లో 100కు 100 మార్కులు రాగా.. గణితం పార్టు-2లో 99 మార్కులు రావడం విశేషం. ఇంగ్లీష్‌లో 90 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు వచ్చాయి. అలాగే హోలీ ఎంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతిలో కూడా సబ్జెక్టులా వారిగా మంచి ప్రతిభను కనబర్చింది. సమంత ప్రతిభకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. తాజాగా ఓ నెటిజన్ సమంతకి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌తో పాటు సమంత కూడా షాక్ అయింది. నీకు ఇది ఎలా వచ్చిందని ప్రశ్నించింది. సామ్ ప్రశ్నకి బదులివ్వని ఆ నెటిజన్ వెంటనే ఆ పోస్ట్‌ని డిలీట్ చేశాడు. కాని అప్పటికే ఆ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
previous post