telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాధికాకు అమితాబ్ వీడియో సందేశం

Radhika

తెలుగులో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పేరుతో షో ప్రసారం కాగా, దీనికి నాగార్జున‌, చిరు హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా రూపొందిన కార్య‌క్ర‌మం కౌన్‌బ‌నేగా క‌రోడ్ పతి. ఈ షోకి ల‌భించిన ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికి హిందీలో స‌క్సెస్‌ఫుల్‌గా ఈ షో న‌డుస్తుండ‌గా, ప‌లు ప్రాంతీయ భాష‌ల‌లోను ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్నారు. ఇక త‌మిళంలోను “నీంగలుమ్‌ వెల్లాలుమ్‌ ఒరు కోడీ” పేరుతో ఓ షో ప్రసారం అయింది. మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షోకు సూర్య, ప్రకాశ్‌రాజ్‌, అరవింద్‌స్వామిలు ఒక్కో సీజన్‌లో హోస్ట్‌లుగా వ్యవహరించారు. హిందీలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా రూపొందిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) మాదిరి త‌మిళంలో ‘కోడీశ్వరి’(కోటీశ్వరి) గేమ్‌ షోను ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్విజ్‌ షోకు రాధిక హోస్ట్‌గా ఉండనున్నారు. క‌ల‌ర్స్‌లో టీవీ ఛానెల్‌లో ప్ర‌సారం కానున్న ఈ షోలో పాల్గొనేవారు కేవ‌లం మ‌హిళ‌లు మాత్ర‌మే ఉంటార‌ని తెలుస్తుంది. డిసెంబ‌ర్ నుండి షో ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. వెండితెర‌పై అస‌మాన న‌టిగా పేరు తెచ్చుకున్న రాధికా శ‌ర‌త్ కుమార్ బుల్లితెర‌పై హోస్ట్‌గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించిన రాధికా తొలిసారి హోస్ట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. డిసెంబ‌ర్ నుండి షో ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అమితాబ్ రాధికాకి వీడియో సందేశం పంపారు. ఈ వీడియోలో అమితాబ్ మాట్లాడుతూ “ఈ స‌మ‌యంలో మిమ్మల్ని అభినందించడం ఎంతో అవసరం… మీరు తొలిసారిగా కేబీసీకి మహిళా హోస్ట్ అవుతున్నారు. కేబీసీ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం. పోటీదారులంతా మహిళలే కావడం ఇక్క‌డ‌ గమనించదగిన విషయం. ఇది అద్భుతం మాత్రమే కాదు… అత్యంత ఉత్సాహపూరితమైన అంశం. మీకు, పోటీదారులకు శుభాకాంక్షలు… ఆల్ దీ బెస్ట్ రాధికా జీ!… మీరు ఎప్పటిలానే మీ కెరియర్‌లో ఉత్కృష్ఠ స్థానాన్ని సంపాదించుకుంటారు’ అని అన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన రాధిక భర్త శరత్‌కుమార్ తన ట్వీట్‌లో ‘ప్రియమైన రాధికా… ఇది నీకు దక్కిన మహోన్నత అవకాశం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కేవలం మహిళల కోసం రూపొందిస్తున్న కేబీసీని నడిపించే మహిళగా మారుతున్నావు. అందుకే మహానటుడు అమితాబ్ నిన్ను అభినందిస్తున్నారు” అని పేర్కొన్నారు.

Related posts