telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇలా వారిని శిక్షిస్తే సమాజం కుప్పకూలిపోతుంది… ఎన్‌కౌంటర్‌పై ఆర్జీవీ స్పందన

Ram-Gopal-Varma

దిశ కేసులో తాజాగా పోలీస్ ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా… సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎన్‌కౌంటర్‌ సబబు కాదంటున్నారు. తాజాగా ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ స్పందించారు.

“ఆ నలుగురు నిందితులు చేసిన దారుణాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసుల ఎన్‌కౌంటర్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేయడంలో న్యాయం ఉంది. కానీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నిందితులను చంపడం న్యాయవ్యవస్థను కించపరిచినట్లే అవుతుంది. ఇలాంటి ఘటనలు అనాగరిక వ్యవస్థకు దారితీస్తుంది. మన వ్యవస్థలో న్యాయం జరగడానికి ఎందుకు అంత సమయం పడుతుందంటే.. ఈ ప్రక్రియలో నేరాలకి సంబంధించిన అన్ని వివరాలను రెండు కోణాల్లో సేకరించాలి. ఒకటి విఫలమైన వ్యవస్థ, రెండోది అందుకు బాధ్యులు ఎవరు. ఈ రెండు విషయాలు తెలుసుకుంటే భవిష్యత్తులో నేరాలను అరికట్టగలం. నిందితులు మరో నేరం చేసే లోపే వారిని అదుపుచేయాలని పోలీసులు వారిని చంపేశారు. కానీ వాళ్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు మొత్తం న్యాయ వ్యవస్థకు జరిగిన నేరం గురించి ఏమీ తెలీకుండా పోతుంది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. క్రిమినల్స్ నేరాలను రూల్ ప్రకారమే బయపెట్టాలి. పోలీసులు, మీడియా వర్గాలు, ప్రజలు చెప్పారని వారిని శిక్షిస్తే సమాజం కుప్పకూలిపోతుంది” అని అన్నారు.

Related posts