telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”

KRKR

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది. ఈ సినిమాకు సెన్సార్ సమస్యతో పాటు పలు వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్. డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సారీ సారీ.. అలవాటులో పొరపాటు. ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకు వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ పెట్టారు. కానీ ముందుగా ఊహించినట్లుగానే సినిమాకు రాజకీయ సెగ తగిలింది.

Related posts