telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆ రెండు బ్యాంకుల నుండి .. రోజుకు వెయ్యి రూ. మాత్రమే .. విత్ డ్రా.. : ఆర్.బి.ఐ

RBI

ఆర్.బి.ఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరో కొత్త రూల్‌ తో వినియోగదారుల పై బాంబు వేసింది. ఈ రూల్‌తో కస్టమర్స్‌ అందరూ.. ఒక్కసారిగా షాక్‌కి గురి అవుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రోజుకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే విత్‌ డ్రా చేసుకునే వీలుందని.. అంతేకాకుండా.. వచ్చే 6 నెలలవరకు కస్టమర్లకు రుణాలు ఇవ్వడం కానీ.. బ్యాంకులో డిపాజిట్లు కానీ.. చేసుకోకూడదని.. ఇరు బ్యాంకులను హెచ్చరించింది ఆర్బీఐ. ఆర్బీఐ తదుపరి ఆదేశాల వరకూ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, మహారాష్ట్ర కో ఆపరేటీవ్ బ్యాంకులు.. ఇవే రూల్స్ పాటించాలని పేర్కొంది.

దీని ప్రకారం.. బ్యాంకులను బ్లాక్‌ చేయాలనే ఉద్దేశ్యం ఆర్బీఐకి లేదని తెలిపింది. ఆర్బీఐ తాజా ప్రకటనపై.. వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు డబ్బులు డ్రా చేసేందుకు క్యూ కట్టారు. ఈ ఆంక్షలతో దాదాపు ఆరు నెలల పాటు ఈ బ్యాంకుల ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

Related posts