telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ లెజెండ్… ఆయనంటే నాకు చాలా గౌరవం… కానీ… : తాప్సి

Taapsee

బాలీవుడ్ సినిమా “బద్లా” గురించి కొద్ది రోజుల క్రితం హీరోయిన్ తాప్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “బద్లా” సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. ఎక్కువ రోజులు పనిచేశాను. కానీ నాకు క్రెడిట్ రాలేదు. దాన్ని అందరూ అమితాబ్ బచ్చన్ సినిమాగానే చూస్తున్నారు` అని తాప్సీ వ్యాఖ్యానించింది. తాప్సీ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అమితాబ్‌తో పోల్చుకోవడంపై ట్రోలింగ్ జరిగింది. దీని గురించి తాప్సీ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడింది. “అమితాబ్ బద్లా` సినిమాకు భారీగా వసూళ్లు వచ్చాయని ఓ వెబ్‌సైట్‌లో రాశారు. `మీరు నా పేరును మర్చిపోయారు. అది నా సినిమా కూడా` అని వారికి సమాధానం ఇచ్చాను. నేను అలా చెప్పింది అమితాబ్ అంటే గౌరవం లేక కాదు. ఆయన క్రెడిట్‌ను తగ్గించాలనీ కాదు. మహిళను కాబట్టే నాకు సరైన క్రెడిట్ ఇవ్వడం లేదా? సినిమాలో మహిళ ఎక్కువ సీన్లలో నటించినప్పటికీ.. దానిని నటుడి సినిమాగానే ఎందుకు చూస్తున్నారు? దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అని తెలుసుకోవాలనుకుంటున్నాను. అమితాబ్ ఒక లెజెండ్ అనే సంగతి నాకు తెలుసు. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది” అని తాప్సీ వ్యాఖ్యానించింది.

Related posts