telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత, రష్మిక అక్కచెల్లెళ్లుగా…!?

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, రష్మిక కలసి నటించనున్నారన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పైగా వీరిద్దరూ ఈ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారట. ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల కథతో సమంత, రష్మికలను సంప్రదించాడనీ, కథ వినగానే చేయడానికి ఇద్దరూ ఆనందంగా అంగీకరించారనీ తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ ప్రముఖ బ్యానర్ ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇది మహిళా ప్రధాన చిత్రంగా రూపొందుతుందట. కాగా, ప్రస్తుతం సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. తమిళంలో రెండు సినిమాలలో నటిస్తోంది. ఇక రష్మిక అయితే అల్లు అర్జున్ సరసన నటిస్తున్న ‘పుష్ప’ సినిమాతో పాటు కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తోంది.

Related posts