గత ప్రభుత్వం రాష్ట్ర విభజన తరువాత సచివాలయంతో పాటుగా ప్రధాన కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల కోసం వారానికి అయిదు రోజుల పని దినాలను నిర్ణయించారు. తొలుత ఇది ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూడాలని..దీని పైన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే..ఏపీ ప్రభుత్వంలో పని చేస్తూ..హైదరాబాద్‌లోని సచివాలయంతో పాటుగా హెచ్ఓడీల్లో పని చేసే ఉద్యోగుల కోసం నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు రాష్ట్ర విభజన కారణంగా ఉద్యోగుల కుటుంబాలు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఏపీలో అయిదు రోజుల పని దినాలను అమలు చేసినా..అప్పట్లో సక్సెస్ కాలేదు.
ఇప్పటి వరకు అమలు ఆవుతున్న ఈ నిర్ణయం పై తాజాగా ఏపీసీఎం జగన్ మరో ఏడాది పొడిగించే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిర్ణయం కొనసాగిస్తారా లేదా అనే సందేహం ఉద్యోగుల్లో వ్యక్తం అటువున్న సందర్భంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకోని, ఉద్యోగులకు ఊరటనిచ్చారు. ఇదే సమయంలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే కీలక అంశం మీద జగన్ మంత్రివర్గ ఉప సంఘంతో సమావేశమై కీలక సూచనలు చేశారు.
సాధ్వి ప్రజ్ఞా సింగ్ ముమ్మాటికీ ఉగ్రవాదే: సిద్ధరామయ్య